సీతక్కతో చెంచు రైతులు

7
- Advertisement -

ప్రజాభవన్ లో మంత్రి సీతక్కను కలిశారు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ కు చెందిన చెంచు రైతులు. 1988లో 27 మంది రైతులకు కడ్తాల్ మండలంలోని అనుమాన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలో 54 ఎకరాలు కేటాయించింది అప్పటి ప్రభుత్వం.

భూభారతి వల్ల ఆ భూములపై తాము పట్టాలు కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న భూములపై తమకు పట్టాలు ఇప్పించాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు చెంచు రైతులు.

వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి ఫోన్ చేసి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క.

Also Read:BB9:ఓనర్‌గా రాము రాథోడ్

- Advertisement -