BB9:ఓనర్‌గా రాము రాథోడ్

7
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 12 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా టెనెంట్స్‌‌లో ఒకరికి ఓనర్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే టెనెంట్స్ తమ గ్రూప్ ప్రయోజనాలని పక్కనపెట్టి తమ కోసం పోరాడాల్సి ఉంటుంది.. ఎవరైతే ఈ గేమ్‌లో గెలుస్తారో వాళ్లు టెనెంట్ ట్యాగ్‌ని తొలగించుకొని బిగ్‌బాస్ మెయిన్ హౌస్‌లో ఓనర్‌గా అడుగుపెడతారు అని చెప్పారు.

ప్రతి రౌండ్‌లో స్టార్ట్ బజర్ మోగగానే ఇద్దరు ఓనర్స్ త్రోవర్స్‌గా మారి గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఎత్తైన ప్లాట్‌‌ఫామ్‌పై ఎక్కి అక్కడి నుంచి టెనెంట్స్‌వైపు ఐటెంమ్స్‌ని విసరాలి.. టెనెంట్స్ తమ స్థానంలో మాత్రమే నిలబడి.. అక్కడి నుంచి కదలకుండా ఓనర్స్ విసిరిన ఐటెమ్స్ పట్టుకొని ఎండ్ బజర్ మోగేలోపు వాటిని తమ బాస్కెట్లో భద్రంగా దాచుకోవాలి.. ప్రతి రౌండ్‌లో ఎవరి దగ్గరైతే తక్కువ ఐటెమ్స్ ఉంటాయో వారు ఆట నుంచి ఎలిమినేట్ అవుతారు అంటూ చెప్పారు.

తొలి రౌండ్‌లో ఫ్లోరాని టార్గెట్ చేశాడు రాము రాథోడ్. ఆమె బాస్కెట్‌లో బొమ్మలు తీయడానికి ట్రై చేశాడు. దీంతో ఆ గ్యాప్‌లో రాముని అటాక్ చేసింది సంజన. అయితే సంజన రాము వస్తువులు తీయడంతో రీతూ చౌదరి సంజనని టార్గెట్ చేసింది. తన బాస్కెట్ ఖాళీ అయిపోవడంతో రీతూని టార్గెట్ చేసింది ఫ్లోరా. ఇలా బజర్ మోగేసరికి తక్కువ ఉన్న ఫ్లోరా గేమ్ నుంచి ఔట్ అయింది. ఫ్లోరా ఔట్ కాగానే వాలంటరీగా సంజన కూడా గేమ్ నుంచి క్విట్ అవుతున్నా అంటూ చెప్పేసింది.

తర్వాతి రౌండ్ మొదలుకాగానే సుమన్ శెట్టిని టార్గెట్ చేశారు సంజనా-ఫ్లోరా. డిఫెండ్ చేసుకునే భాగంగా సుమన్ శెట్టి చెయ్యి.. ఫ్లోరాకి తగిలింది. వెంటనే సంచాలక్‌గా ఉన్న ప్రియ.. అన్న కొడితే ఎలిమినేట్.. అంటూ రూల్ పెట్టింది. ఈ క్రమంలో వాగ్వాదం జరగడంతో కోపమొచ్చి బాస్కెట్‌ని తన్నేశాడు సుమన్ శెట్టి. ఈ రౌండ్‌లో ఫౌల్ చేసినందుకు సుమన్ శెట్టి ఔట్ అయ్యారు.

ఇక మూడో రౌండ్‌ బజర్ మోగగానే సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి ముగ్గురూ కలిసి రీతూను టార్గెట్ చేశారు. రీతూ బాస్కెట్ మొత్తం ఖాళీ చేసి తనూజ, రాము, ఇమ్మూకి పంచేశారు. ఇలా ప్రతి రౌండ్‌లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ చివరికి ఇమ్మాన్యుయేల్, రాము ఇద్దరే మిగిలారు. టాప్-2గా నిలిచిన రాము, ఇమ్మూ నుంచి ఓనర్‌‌గా మారి హౌస్‌లోకి వెళ్లేదెవరో నాకు చెప్పండి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో రీతూ తప్ప మిగిలిన నలుగురూ సపోర్ట్ చేసినా కూడా ఇమ్మానుయేల్ ఓనర్ కాలేకపోయాడు.

Also read: కాంతార 1..ట్రైలర్ డేట్ ఫిక్స్!

- Advertisement -