ట్రంప్ తర్వాత అధ్యక్షుడు సెహ్వాగే..!

186
Virender Sehwag as US President tweet

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో పెట్టే ట్వీట్లు అభిమానులను విపరీతంగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. సెహ్వాగ్ ట్వీట్ చేశాడంటే అది వైరల్ కావడం ఖాయం అన్నట్టుగా ఆయన ట్వీట్లు చేస్తుంటాడు. తాజాగా సెహ్వాగ్ చేసిన ట్వీట్ అందరిని విపరితంగా ఆకర్షిస్తోంది.

భార‌త్‌, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ నేప‌థ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పోలుస్తూ ఆస్ట్రేలియా మీడియా క‌థ‌నాలు రాయ‌డం అల‌జ‌డి రేపిన విష‌యం తెలిసిందే. అయితే, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ తాజాగా ఏప్రిల్ ఫూల్స్ డేను పురస్కరించుకుని ట్విట్టర్ లో  సరదాగా ఓ పోస్టు పెట్టాడు. డొనాల్డ్ ట్రంప్ తర్వాత సెహ్వాగే అమెరికా అధ్యక్షుడంటూ న్యూయార్క్ టైమ్స్ కథనం రాసిందని ఓ ఫొటో జతచేశాడు.

ప్రముఖ జర్నలిస్టు స్టీఫెన్‌ స్మిత్.. ప‌త్రిక‌లోని స్పోర్ట్స్ పేజీలో ఏమ‌ని పేర్కొన్నారంటే.. తరచూ అమెరికా వస్తున్న ట్విట్ట‌ర్ సూప‌ర్‌స్టార్‌ వీరూతో అమెరికా ప్రభుత్వం రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటోందని రాశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాలు ఇద్దరూ కలిసి సెహ్వాగ్‌ను అమెరికా అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేయనున్నారని అందులో పేర్కొన్నారు.

అయితే ఈ ఏడాది అమెరికా పర్యటనకు మోడీ వెళ్లనున్న నేప‌థ్యంలో వారిద్దరు మోడీతో చర్చిస్తారని సెహ్వాగ్ పోస్ట్ చేసిన ఆ న్యూస్ క‌థ‌నంలో ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన భార‌త్‌, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ నేప‌థ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పోలుస్తూ ఆస్ట్రేలియా మీడియా క‌థ‌నాలు రాయ‌డం అల‌జ‌డి రేపిన విష‌యం తెలిసిందే.