తెలంగాణ బీజేపీ నాయకుడిపై చీటింగ్ కేసు నమోదైంది. వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానని చెప్పి NRIకి రూ.24.53 కోట్ల టోకరా వేశారు బీజేపీ నాయకుడు గజ్జల యోగానంద్. హైదరాబాద్ – నిజాంపేట ప్రాంతానికి చెందిన పవన్ కుమార్ అనే ప్రవాస భారతీయుడికి తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని, లాభాలు వస్తాయని ప్రతిపాదించారు గజ్జల యోగానంద్.
పరిచయం ఉన్న వ్యక్తి అని నమ్మి, 2019 నుండి 2024 వరకు దాదాపు రూ.24.53 కోట్ల పెట్టుబడులు పెట్టారు పవన్ కుమార్. ఎన్ని ఏళ్లు గడిచినా షేర్లు తన పేరు మీద నమోదు కాకపోవడంతో, 2024లో పవన్ కుమార్ నిలదీయడంతో మంజీరా హోటల్స్ అండ్ రిసార్ట్స్ షేర్లు ఇస్తానని ఎంఓయూ చేసుకున్నారు యోగానంద్.
అయినప్పటికీ షేర్లు ట్రాన్స్ఫర్ కాకపోవడంతో ఆరా తీయగా, యోగానంద్ షేర్లను టూరిజం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టాడని గుర్తించారు పవన్ కుమార్.మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యోగానంద్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.
Also Read:డైటింగ్ కంటే ఇలా చేస్తేనే మేలు?

