- Advertisement -
ఛత్తీస్‌గఢ్ లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో బీజాపూర్ సరిహద్దు వద్ద భద్రతా బలగాలు , నక్సలైట్ల కు మధ్య గురువారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ ఘటనలో ముగ్గురు నక్సలైట్లు హతమయ్యారు.
ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చావన్ తెలిపారు. మూడు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే. జవాన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులకు పేలుళ్లకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా భేద్రే కుట్రు రహదారిలో ఐఈడీ పేలుళ్లకు మావోయిస్టులు పాల్పడ్డారు. ఐఈడీ పేలిన సమయంలో పోలీసుల వాహనంలో 15 మంది డీఆర్‌జీ జవాన్లు ఉన్నారు.
Also Read:డాకు మహారాజ్..ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
- Advertisement -