ఆ రెండు రాష్ట్రాల్లో విజయం ఎవరిది?

65
- Advertisement -

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఈ నెల 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా.. నేడు ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్ ఘడ్ లో మొత్తం 90 సీట్లకు గాను మొదటి విడత 20 సీట్లకు ఈ నెల 7న పోలింగ్ జరిగింది. ఇక ఈ రోజు రెండో విడతలో 70 సీట్ల కు పోలింగ్ జరగనుంది. అటు మద్యప్రదేశ్ లో 230 సీట్లకు గాను ఒకే విడతలో నేడు పోలింగ్ జరగనుంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉండగా.. ఈసారి ఎన్నికలతో బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పై చేయి సాధించినప్పటికీ హస్తం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అవ్వడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈసారి ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొనే అవకాశం ఉంది. అటు చత్తీస్ ఘడ్ లో 90 సీట్లకు గాను అధికారంలోకి వచ్చేందుకు 46 సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో 68 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఈసారి హస్తం పార్టీకి చెక్ పెట్టి తాము అధికారం చేపట్టాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. దీంతో చత్తీస్ ఘడ్ లో కూడా ఇరు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఛత్తీస్ ఘడ్ లో జేసీసీ, బిఎస్పీ, సిపిఐ పార్టీల ప్రభావం కూడా కొంత మేర ఉండే ఛాన్స్ ఉంది. మరి ఈ పార్టీల వల్ల ఓట్ల చీలిక ఎలా ఉండబోతుందనేది చూడాలి. మరి ఈ రెండు ఆరాష్ట్రాలల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఎదురు చూడక తప్పదు.

Also Read:Bigg Boss 7 Telugu:ఎవిక్షన్‌ ఫ్రీ పాస్ యావర్‌దే

- Advertisement -