మైనర్ బాలికలకు ఐ లవ్ చెప్పడం లైంగిక వేధింపుల కిందకు రాదని సంచలన తీర్పు చెప్పింది ఛత్తీస్‌గడ్ హైకోర్టు.ఈ మేరకు జస్టిస్ సంజయ్ ఎస్ అగర్వాల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అంతేగాదు పోక్సో చట్టం కింద కేసు నమోదైన యువకుడిని నిర్ధోషిగా ప్రకటించింది.
2019 అక్టోబర్ 15న 15 ఏళ్ల విద్యార్థిని పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా ఓ యువకుడు ఆమెకు ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. దీంతో విద్యార్థిని స్కూల్లో యువకుడిపై ఫిర్యాదు చేసింది. తనను వేధిస్తున్నాడని, ‘ఐ లవ్ యూ’ కూడా చెప్పాడని వెల్లడించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిపై ఐపీసీ 354డీ, 509, పోక్సో చట్టంలోని సెక్షన్ 8, ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(2) కింద కేసు నమోదు చేశారు.
Also Read:ఆరోజే సినిమాలు మానేస్తా!
సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ట్రయల్ కోర్టు యువకుడిని నిర్దోషిగా ప్రకటించింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో సవాల్ చేసింది. కేసుకు సంబంధించిన అన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు యువకుడిని నిర్ధోషిగా ప్రకటించింది. ఈ కేసులో రాష్ట్ర హైకోర్టు చేసిన అప్పీల్‌ను తిరస్కరించింది.

