- Advertisement -
కాల్పుల మోతతో ఛత్తీస్‌గఢ్ దద్దరిల్లిపోతోంది. వరుసగా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోలు హతమయ్యారు.
నారాయణ్‌పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన ఏడుగురిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. పలువురు మావోయిస్టులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్‌మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు..కాల్పులు జరపగా ఏడుగురు మృతి చెందారు.
Also Read:Revanth:ఎవరికి భయపడం
- Advertisement -