- Advertisement -
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో మధ్యాహ్నం 2.35నిమిషాలకు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ని నింగిలోకి పంపారు. దాదాపు 40 రోజుల తర్వాత చంద్రయాన్ -3 జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా, చంద్రుడిపై సాప్ట్ ల్యాండింగ్‌ను సాధించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది.
గురువారం మధ్యాహ్నమే రాకెట్ కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 25.30 గంటలపాటు కొనసాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 2గంటల 35 నిమిషాల 13 సెకన్లకు రెండో ప్రయోగవేదిక నుంచి చంద్రయాన్ -3 తో కూడిన ఎల్‌వీఎం-3 ఎం4 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది.
Also Read:ఆ నిర్మాత బాగా ఇబ్బంది పెట్టాడట
- Advertisement -