ఏపీ స్కిల్ స్కాంలో రెగ్యులర్ బెయిల్ లభించిన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. ఇక శనివారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు.
ధర్మాన్ని కాపాడమని స్వామివారిని ప్రార్ధించా, తెలుగు జాతి ప్రపంచంలోనే నెం.1గా ఉండాలన్నారు చంద్రబాబు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని తెలిపిన చంద్రబాబు.. ప్రపంచంలో భారతీయులకు గుర్తింపు వచ్చిందని, భవిష్యత్తులో భారతీయులతోపాటు ప్రపంచంలో అన్ని రంగాల్లో నెం.1 స్థానంలో తెలుగు కమ్యూనిటీ ఉండాలన్నారు.
తిరుపతి దర్శనం అనంతరం అమరావతికి వెళ్లనున్నారు చంద్రబాబు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చర్చించనున్నారు.
Also Read:ఎగ్జిట్ పోల్స్ లో నిజమెంత?