నేడు సాయంత్రం రాజీనామా చేయనున్న చంద్రబాబు..

238
ap cm resign
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ​ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 150 పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ కేవలం 24 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన ఒక స్థానానికే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 19 చోట్ల, టీడీపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో వైయస్‌ జగన్‌ సీఎం అయినట్లేనని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నచంద్రబాబునాయుడు ఇవాళ సాయంత్రం రాజీనామా చేయనున్నారు. సాయంత్రం చంద్రబాబు రాజ్ భవన్ కు రాజీనామా లేఖ పంపనున్నారు. అలాగే సాయంత్రం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. చంద్రబాబు నివాసం కార్యకర్తలు లేక వెలవెలబోయాయి.

కాగా వైసీపీ పార్టీ వర్గాలు గెలుపు సంబరాల్లో మునిపోయారు. అంతేకాదు జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకార తేదీని కూడా ప్రటించారు. ఈ నెల 30న జగన్‌ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే నెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని… తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.

- Advertisement -