ఈనెల 30న జగన్ ప్రమాణ స్వీకారం

214
YS Jagan Mohan Reddy

ఏపీ ముఖ్యమంత్రిగా ఈనెల 30న వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు వైసిపి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే జగన్ పార్టీ ముఖ్య నేతలతో తాడేపల్లి గూడెం లోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈనెల 25 వైసిపి శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఇక ప్రస్తుతం వస్తున్న ఫలితాల్లో ఏపీలో వైయస్సార్ సీపీ విజయ దుందుభీ మోగిస్తుంది. దాదాపు 150 స్ధానాల్లో వైసిపి ఆధిక్యంలో ఉంది. ఇక టీడీపీ 30 స్ధానాల్లో లీడింగ్ లో ఉంది. జగన్ సన్నిహితుడు ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికే జగన్ ను కలుకుకుని శుభాకాంక్షాలు తెలిపారు.