టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి స్కిల్ స్కామ్ లో భాగంగా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. కేవలం స్కిల్ స్కామ్ మాత్రమే కాకుండా ఇంకా మరో మూడు స్కామ్ లు కూడా చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయి. ఇక ఇటీవల బయటకు వచ్చిన అమరావతి రింగ్ రోడ్ స్కామ్ లో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ హస్తం ఉందంటూ ఇటీవల ఏపీ సీఐడీ ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే జరుగుతున్నా పరిణామాల దృష్ట్యా ముందస్తు బెయిల్ కోసం నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంచితే ఈనెల 6న నారా లోకేష్ చంద్రబాబుతో ములాఖత్ అవ్వనున్నారు.
దీంతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత మొదటి సారి ఆయనతో ములాఖత్ జరిపిన పవన్.. బయటకు వచ్చి ఊహించని రీతిలో పొత్తు ప్రకటించారు. దీంతో ములాఖత్ లో చంద్రబాబు పవన్ మద్య ఎలాంటి విషయాలు చర్చకు వచ్చాయనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఇప్పుడు లోకేష్ ములాఖత్ అవుతుండడంతో చంద్రబాబు లోకేష్ కు ఎలాంటి సూచనలు చేయనున్నారు.? తాజా పరిణామాల దృష్ట్యా లోకేష్ విషయంలో చంద్రబాబు డైరెక్షన్ ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఆసక్తిని పెంచుతున్నాయి.
ప్రస్తుతం టీడీపీ నాయకత్వలేమి తో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇటుచూస్తే చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నేపథ్యం పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు చంద్రబాబు ఎలాంటి సూచనలు చేస్తారో అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే జనసేనతో కలిసి నడవాలని లోకేష్ పార్టీ నేతలకు సూచించారు. ఇక ములాఖత్ తరువాత జనసేన టీడీపీ మద్య సీట్ల పంపకల విషయంలో లోకేష్ తో బాబు చర్చిస్తారా ? అనే డౌట్లు వ్యక్తమౌతున్నాయి. మరి ములాఖత్ తరువాత చంద్రబాబు డైరెక్షన్ లో లోకేష్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read:Harishrao:బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదు