అప్పుడే తెలుగు తెర నవ్వు ఆగదు!

21
- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో పూర్తి హాస్య చిత్రాలు తీసేవారు, ఇప్పుడు ఎందుకూ ఎక్కువమంది రావడం లేధు ?, ఫామ్ లో ఉన్న ఆ అనిల్ రావిపూడి ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు, కాబట్టి, తెలుగు హాస్య కథకుల కోరత ఉందంటూ ఓ చర్చ ఎప్పటి నుంచో ఉంది. నవ్వు కూడా ప్లాస్టిక్ పూవులా ఆర్టిఫిషియల్ అయిపోయిన ఈ రోజుల్లో.. దర్శకుడు ‘ఇ.వి.వి’లా, హాస్య బ్రహ్మ జంధ్యాల గారిలా నవ్వించగలిగేది ఎవరు ?,అగ్నికి వాయువు తోడైనట్టుగా ఓ హాస్య దర్శకుడికి మరో గొప్ప హాస్య రచయిత తోడు అవ్వాలి. అప్పుడే హాస్యం పండుతుంది. నోటి పైకి చిరు నవ్వు వస్తోంది.

అహానా పెళ్ళంట, అప్పుల అప్పారావు,ఆ ఒక్కటీ అడక్కు, జంబలకడి పంబ ఇలా మొదలెట్టి హాస్య చిత్రాలకు ఒక స్థాయి తెచ్చారు జంధ్యాల, ఇ.వి.వి. హాస్య చిత్రాలే కాదు, కమర్షియల్ చిత్రాలు, ఆమె తరహా సందేశాత్మక చిత్రాలు ఇలా సినిమా ఏదైనా వీరిద్దరూ కామెడీ ట్రాక్స్ కి పెద్ద పీట వేసేవారు. కానీ ఆ చిత్రాలు ఈ జనరేషన్ కి కనెక్ట్ కాకపోవచ్చు. కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే.. ఈ హాస్యం అనే జోనర్ కి సినిమాల్లో లైఫ్ చాలా తక్కువ. అలాగే హాస్య దర్శకులకు కూడా ఎక్కువ స్పాన్ ఉండదు. జంధ్యాల గారు 80వ దశకంలో ఓ వెలుగు వెలిగారు. 90వ దశకం వచ్చేసరికి ఆయనకు ఉద్వాసన పలికేశారు.

మరొక దర్శకుడు రేలంగి నరసింహారావు గారు కూడా విజయవంతమైన హాస్య చిత్రాలు తీశారు , కానీ ఆయన కూడా 90 ల చివరికి వచ్చేసరికి నమస్కారం పెట్టారు. ఇ.వి.వి గారి కెరీర్ కూడా 2000 వ సంవత్సరం వచ్చేసరికి తగ్గడం మొదలైంది. మరి, ఇ.వి.వి గారి తర్వాత ఆ స్థాయి హాస్యంతో నవ్వించే దర్శకులు రాలేదు. మధ్యలో శ్రీనువైట్ల వచ్చినా ఎక్కువ కాలం నిలబడలేదు. అసలు హాస్య దర్శకులకు దర్శకుడిగా లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు హాస్య దర్శకులు వస్తూనే ఉండాలి. అప్పుడే తెలుగు తెర నవ్వు ఆగదు.

Also Read:Harishrao:బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదు

- Advertisement -