కుప్పంలో బాబు స్ట్రాటజీ ఏంటి?

25
- Advertisement -

టీడీపీ అధినేత చద్రబాబు నాయుడు కుప్పం విషయంలో అలర్ట్ అయ్యరా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి కుప్పంలో బాబు ఓటమి కోసం వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. కుప్పం టీడీపీ కంచుకోట అనే సంగతి అందరికీ తెలిసిందే. 1989 నుంచి చంద్రబాబు అడ్డాగా మార్చుకున్నారు. అయితే ఆ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి షాక్ తగిలింది. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో అప్పటి నుంచి వై నాట్ కుప్పం అనే నినాదాన్ని ఎంచుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎలాగైనా కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టి సత్తా చాటలని జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు, అందుకే స్థానికంగా బలం ఉన్న యువ నేత భరత్ కు టికెట్ కేటాయించారు..

భరత్ కూడా నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడు టచ్ లో ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజక వర్గంలోని ప్రస్తుత పరిస్థితులపై స్థానిక నేతలతో తాజా పర్యటనలో సమావేశం అయినట్లు తెలుస్తోంది. నియోజక వర్గంలో ప్రజాభిప్రాయం కొరకు సర్వే కూడా చేయించినట్లు సమాచారం. కుప్పంలో ఆరు సార్లు వరుసగా విజయం సాధించినప్పటికి.. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు శాతం తగ్గడంతో ఏమైనా వ్యతిరేకత ఉందా అనే దానిపై కూడా నేతలతో చర్చించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన చంద్రబాబు.. ఈసారి అంతకు మించి మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో ఉన్నారట.

అందుకే కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మెజారిటీ ఏ మాత్రం తగ్గిన బాబు హవా తగ్గిందనే విమర్శలు వ్యక్తమవుతాయి. పైగా ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. దీన్ని బట్టి 2029 ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశాలు తక్కువ. అందుకే ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు కుప్పం విషయంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. మరి ఈ సారి కుప్పంలో ఆయనకు ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో చూడాలి.

Also Read:కవితకు 14 రోజుల రిమాండ్..

- Advertisement -