గేమ్ ఛేంజర్..చరణ్ బర్త్ డే పోస్టర్

10
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న గేమ్‌ ఛేంజర్‌ మూవీ విడుదల తేదిపై రకరకాల రూమర్స్ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక రేపు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సాంగ్‌ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ మేరకు ఓ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. జరగండి జరగండి అనే పాటను రేపు ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్‌లో రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది.

చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Also Read:Kavitha:కడిగిన ముత్యంలా బయటకువస్తా

- Advertisement -