ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ..

7
- Advertisement -

పెన్షన్ దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజలందరి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని…ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత తమపై ఉందన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ. 1000 పెంచి, ఇకపై రూ.4000 ఇస్తున్నాం అని చెప్పారు. దివ్యాంగులకు రూ.6000 పెన్షన్ ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం అని లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడుతున్నా ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చాం అని వెల్లడించారు.

సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆధ్యుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టామన్నారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్ద సామాజిక పింఛన్ల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు చంద్రబాబు. ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.

Also Read:Jagan:హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా!

- Advertisement -