డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి:బాబు

11
- Advertisement -

NDA ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు..ఏపీలో మన ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టికి ఏడాది అయింది..రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలిసి మీరు రాష్ట్రాన్ని
నడపగలుగుతారా అని చాలా మంది నన్ను ప్రశ్నించారు అన్నారు.

ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్తామని చెప్పాను, ఆ డైరెక్షన్ లోనే ముందుకు పోతున్నాం అన్నారు. మేము ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో తల్లికి వందనం అతి ముఖ్యమైనది అని చెప్పారు.

ఈ రోజు నుంచి తల్లికి వందనం పథకం ప్రారంభించబోతున్నాం. ప్రతి తల్లి ఖాతాలో నగదును జమ చేస్తాం. చెప్పిన విధంగా ఇంట్లో ఎంత మంది పిల్లులు అంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి.. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే పెట్టుబడులు.. దేశంలో లేని విధంగా అన్నక్యాంటీన్లు నడిపిస్తున్నాం అన్నారు.

దీపం పథకం కింద ఆడపడుచులకు లోన్లు ఇస్తున్నాం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాం.. తల్లికి వందనం పథకం ప్రారంభించబోతున్నాం.. ప్రతి తల్లి ఖాతాలో నగదును జమ చేస్తాం.. కూటమి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులు అని చెప్పారు.

Also Read:హీరో నిఖిల్ సినిమా సెట్‌లో భారీ వరద

- Advertisement -