విమాన ప్రమాదం..కేసీఆర్ దిగ్బ్రాంతి

16
- Advertisement -

గుజరాత్ ఘోర విమాన ప్రమాదంపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాసాలపై విమానం కూలిన ఈ దుర్ఘటనలో ప్రయాణికులు, స్థానికులు, సహా వైద్య విద్యార్థులు మృత్యువాతపడిన విషయంపై కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆర్థికంగా సహాయం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్రం మరియు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలను కేసీఆర్ కోరారు.

తమ ఆప్తులను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబాలపై కేసీఆర్ దయతో మనసు వెలిబుచ్చారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు.

Also Read:డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి:బాబు

- Advertisement -