నందుల కుమ్ములాట…ఆగేనా!

230
Chandrababu naidu Self Goal with Nandi Awards
- Advertisement -

మూడు సంవత్సరాల తర్వాత ఎట్టకేలకూ ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల జాబితా టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. నంది లొల్లితో చిత్ర పరిశ్రమ నిలువునా చీలింది. పలువురు నిర్మాతలు, నటులు,సినీ పరిశ్రమకు  చెందిను పలువురు  బాహాటంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రత్యేకించి కమ్మ కులానికి చెందిన వారికి అవార్డులు దక్కడంపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు విసురుతున్నారు.

నంది అవార్డుల కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న బాలకృష్ణ లెజెండ్‌కు  తొమ్మిది అవార్డులు రావడాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు.  బాలయ్య తెలుగుదేశం ఎమ్మెల్యే కావడం వల్ల, ఏపీ సీఎం చంద్రబాబుకు వియ్యంకుడుతో లెజెండ్ ఏకంగా నవ నందులు దక్కాయని వ్యాఖ్యానిస్తున్నారు. నంది అవార్డుల ఎంపికపై తనదైన శైలీలో స్పందించారు దర్శకుడు వర్మ. అవార్డుల కమిటీకి
ఆస్కార్‌ ఇవ్వాలంటూ సెటైర్లు విసిరారు.

 Chandrababu naidu Self Goal with Nandi Awards
అరిచేస్తా, పొడిచేస్తా అంటే 9 అవార్డులు ఇస్తారా..? నిర్మాత బండ్ల గణేష్ మండిపడ్డారు.  రేసుగుర్రం, రుద్రమదేవి, మనం సినిమాలకు నంది అవార్డులు రాలేదున్న బండ్ల అన్నింటికీ జ్యూరీ బాధ్యత వహించాలన్నారు. ఇండస్ట్రీలో నాగార్జున, బాలకృష్ణ మధ్య గొడవల వల్లే ఇలా చేశారని గణేశ్ నర్మగర్భంగా వ్యాఖ్యనించారు. ఉత్తమ కుటుంబ చిత్రానికి ఇచ్చే అక్కినేని నాగేశ్వరరావు
అవార్డును ఉద్దేశపూర్వకంగానే తీసేశారని ఆరోపించారు. ఇవి నంది అవార్డ్స్ కాదు..సైకిల్ అవార్డ్స్ అని దుయ్యబట్టారు.

నంది అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందని బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశాడు.  మూడేళ్లకు ప్రకటించిన నంది అవార్డుల్లో మెగా కుటుంబానికి చెందిన ఒక్క హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు రాలేదని అసహనం వ్యక్తం చేశాడు.

ఇక ప్రభాస్, అనుష్క ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ‘బాహుబలి’ . తన నటనతో జాతీయస్థాయిలో ప్రేక్షకుల మెప్పుపొందిన ప్రభాస్‌కు ఒక్క అవార్డు కూడా రాకపోవడం ఆశ్చర్యకరమేనంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కినా… సొంత రాష్ట్రంలో మాత్రం ప్రభాస్‌కు చేదు అనుభవం తప్పలేదని కామెంట్లు పోస్టు చేస్తున్నారు. రేసుగుర్రం నిర్మాత నల్లమలపు బుజ్జి మరో అడుగు ముందుకేసి కమ్మ లాబీయింగ్ వల్లే ఇలా జరిగిందని విమర్శించారు.

రుద్రమదేవి లాంటి  సినిమా తీసినందుకు నన్ను క్షమించండి అంటూ దర్శకుడు గుణశేఖర్ అన్నారు. మా సిన్మాకి పన్ను మినహాయింపు ఎందుకివ్వలేదని ప్రశ్నించడమే నేను చేసిన తప్పా? అని ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

 Chandrababu naidu Self Goal with Nandi Awards
నంది అవార్డులు పచ్చపార్టీ తమ కార్యకర్తలకు కండువాలను కప్పినట్లుగా కప్పింది. అవార్డులకు అర్హత వున్న చిత్రాలను విస్మరించి తమకు అనుకూలంగా వున్న వారికే అవార్డులను పంచిపెట్టిందని’ నిర్మాత మల్కాపురం శివకుమార్‌ విమర్శించారు.

దర్శకుడు మారుతి సైతం నంది అవార్డులపై నిరసన గళం విప్పారు.  నటుడు ఉత్తేజ్‌ ‘ఉత్తమ అత్త, మేనత్త, అమ్మ, అక్క, చెల్లి, అత్యుత్తమ చెల్లి’ అవార్డులను ప్రకటిస్తుంటారు. సేమ్ నంది అవార్డులు ప్రకటించిన తీరు అలాగే ఉందంటూ ఓ సీరియల్‌కి సంబంధించిన వీడియోని పోస్టు చేశారు.

రుద్రమదేవి లాంటి సినిమాకు నంది అవార్డు దక్కకకపోవడాన్ని తప్పుబట్టారు ఆర్ నారాయణమూర్తి. ఇదంతా చూస్తుంటే నంది అవార్డుల మీద నమ్మకం పోతుందన్నారు. గతంలో విలువలు, మానవీయతకు అద్దం పట్టే సినిమాకు నంది అవార్డులు ఇచ్చేవారని, ఇప్పుడు ఈ అవార్డులు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు కేరాఫ్ గా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తంగా మూడేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు వివాదానికి కేరాఫ్‌గా మారాయి. గతంలో చిన్న చిన్న విమర్శలు వెల్లువెత్తిన ఇంత పెద్దమొత్తంలో ఇండస్ట్రీకి చెందిన పులువురు బహిరంగ విమర్శలకు దిగుతుండటం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -