తెలంగాణపై చంద్రబాబు అక్కసు

7
- Advertisement -

తెలంగాణపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం రాజకీయంగా, నీటి వివాదాల పరంగా కొత్త చర్చలకు దారితీసింది. తాజాగా, కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం అధికారిక లేఖ పంపింది. ఈ చర్య రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచకాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను మళ్లీ ముందుకు తెచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 16న జారీ చేసిన జీవో ప్రకారం, ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 16 కొత్త ప్రాజెక్టుల కోసం డీపీఆర్‌లు సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలోని సాగునీరు, తాగునీటి అవసరాలు మరింత మెరుగుపడతాయని తెలంగాణ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, ఈ నేపథ్యంలో ఏపీ జలవనరుల శాఖ కేంద్రానికి రాసిన లేఖలో రాష్ట్ర విభజన అనంతరం టెలంగాణ మొత్తం 42 కొత్త ప్రాజెక్టులు చేపట్టిందని, వీటిలో అనేకం సీడబ్ల్యుసీ (Central Water Commission), అపెక్స్ కౌన్సిల్, కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే ముందుకు సాగుతున్నాయని ఆరోపించింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఏ కొత్త ప్రాజెక్టులూ నిర్మించకుండా కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ డిమాండ్ చేసింది.

Also Read:పంచాయతీ ఎన్నికల పోలింగ్..అప్‌డేట్‌

అలాగే తెలంగాణ చేపడుతున్న ఈ ప్రాజెక్టుల వల్ల కృష్ణా నీటిలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, అందువల్ల ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వకూడదని ఏపీ మరోసారి కేంద్రాన్ని కోరింది. ఈ లేఖతో రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం మరోసారి ముదురే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -