గోల్డ్ కార్డ్‌పై ట్రంప్ కీలక ప్రకటన

17
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన “గోల్డ్ కార్డ్” పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం, వ్యక్తులు 1 మిలియన్ డాలర్లు చెల్లించి US లో లీగల్ స్టేటస్‌ను పొందడంతో పాటు తర్వాత పౌరసత్వం కూడా పొందవచ్చు. విదేశీ ఉద్యోగులను తమ వద్ద ఉంచుకోవాలనుకునే కంపెనీలు ప్రతి ఉద్యోగికి 2 మిలియన్ డాలర్లు చెల్లించాలి.

వైట్ హౌస్‌లో వ్యాపార రంగ ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ట్రంప్, గ్రీన్ కార్డ్‌తో పోలిస్తే గోల్డ్ కార్డ్ మరిన్ని ప్రయోజనాలు అందిస్తుందని అన్నారు. అమెరికాలో పనిచేయాలని కోరుకునే ప్రతిభావంతులైన వారికి ఇది ఒక గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు.

ట్రంప్ మాట్లాడుతూ..దేశానికి ఎంతో ఉత్సాహకరమైన రోజు ఇది. ట్రంప్ గోల్డ్ కార్డ్‌ను ప్రారంభించాం. ఇది గ్రీన్ కార్డ్ లాంటిదే కానీ మరింత ప్రయోజనాలతో ఉంటుంది. కంపెనీలు ఏ విద్యాసంస్థ నుంచైనా వ్యక్తిని తీసుకొని, గోల్డ్ కార్డ్ కొనుగోలు చేసి, అమెరికాలోనే ఉంచుకోవచ్చు. ఇంతకుముందు ఉండని ప్రతిభావంతులు ఇప్పుడు దేశంలో ఉండే అవకాశం లభిస్తుంది అని అన్నారు.

ఈ పథకం ద్వారా అమెరికా ట్రెజరీకి భారీ ఆదాయం వస్తుందని ట్రంప్ వెల్లడించారు. కాలేజీల నుంచి చదువు పూర్తి చేసిన భారతదేశం, చైనా, ఫ్రాన్స్ విద్యార్థులు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. కంపెనీలు దీన్ని స్వాగతిస్తాయి. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ఎన్నోసార్లు ఈ సమస్యపై మాట్లాడారు. ఇది ఇక సమస్య కాద. అలాగే అమెరికా ట్రెజరీకి బిలియన్ల డాలర్లు వచ్చేందుకు అవకాశం ఉంది అని తెలిపారు.

Also Read:ఏపీకి పెట్టుబడులే టార్గెట్‌గా లోకేష్ టూర్‌

1990లో వచ్చిన EB-5 వీసా ప్రోగ్రామ్‌ను ఇప్పుడు ఈ కొత్త గోల్డ్ కార్డ్ పథకం భర్తీ చేయనుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఉద్యోగాల సృష్టికి అనుకూలంగా ఈ కొత్త పథకాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

- Advertisement -