మహానటి సినిమాకు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మొట్ట మొదటి సారి ఒక తెలుగు హీరోయిన్ జీవితం ‘మహానటి’ చిత్రం ద్వారా చూసే అవకాశం దక్కింది. అన్ని వర్గాల వాళ్లు సినిమాను ఆదరిస్తున్నారు అంటే సావిత్రిని మహానటి అని ఎందుకు అంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘మహానటి’ గురించే చర్చించుకుంటున్నారు. సాదరణ ప్రేక్షకుడి దగ్గర నుండి సినీ ప్రముఖులు, రాజకీయ నేతల వరకు ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు.. నాటి మేటి నటులు, దర్శకుల పాత్రలను నేటి నటులతో నటింపజేసి ప్రేక్షకులను ఎలా మెప్పించగలిగారనేది ఆసక్తికరంగా మారింది.
అయితే తాజాగా అమరావతిలో జరుగుతున్న టీడీపీ సమావేశంలో మహానటి సినిమాపై ఆసక్తికర చర్చ జరిగిందట. ఈ సినిమా గురించి టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబుకు, పార్టీ సభ్యులకు మధ్య చర్చ జరిగింది. మహనటి చాలా బాగుందని కొందరు తనతో చెప్పారని… ఎలా ఉందని నేతలను కూడా అడిగారట సీఎం చంద్రబాబు. జీవిత చరిత్రలపై చిత్రాలు తీస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని… తాను కూడా ఈ సినిమాను చూస్తానని ఆయన తెలిపారు.
ఇక ఈ సమావేశంలో మొదట టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ జీవితంపై నిర్మించ తలపెట్టిన బయోపిక్‌పై చర్చ వచ్చింది. ఈ చర్చలో భాగంగా సావిత్రిపై నిర్మించిన మహానటి బాగా వచ్చిందని అంటున్నారని, విమానాశ్రయంలో కూడా తనకు ఈ విషయం చెప్పారని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్‌పై కూడా ఇలాగే సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుందని టీడీపీ నాయకులు అన్నారు.