మద్దతుపై 23 తర్వాతే..బాబుతో తేల్చిచెప్పిన మమత..!

235
chandra babu mamatha
- Advertisement -

ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్ని గాసిప్‌గా అభివర్ణించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా మమతా చర్చలు జరిపారు ఏపీ సీఎం చంద్రబాబు. సోమవారం బెంగాల్‌తో మమతతో భేటీ అయ్యారు. కేంద్రంలో హంగ్ ఏర్పడితే బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని కోరారు. సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో భవిష్యత్ వ్యూహాల గురించి చర్చించారు.

అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా బాబుకు మమత చెప్పినట్లు తెలుస్తోంది. ఈసందర్భంగా ఎగ్జిట్ పోల్స్ అంశం వీరిమధ్య చర్చకు రాగా అవన్ని తప్పని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదంతా ఈవీఎంలు మానిపులేట్ చేసే గేమ్ ప్లాన్‌లో భాగమని..ఈ విషయంలో అందరం ఒకేతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారని సమాచారం.

ఎన్డీయేతర పక్షాలకు కాంగ్రెస్ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. అయితే మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కూటమిలోని పార్టీలన్నీ కలిసి పూర్తి స్థాయిలో చర్చలు జరిపనున్నాయి. ఇక ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీలో పవార్, రాహుల్, ఏచూరి, సోనియా గాంధీలను కలిశారు.

- Advertisement -