ఏపీలో రాజకీయాలు క్షణ క్షణం ఉత్కంఠ భరితంగా మారుతున్నాయి. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తరువాత ఏపీ రాజకీయాల్లో రాజుకున్న రగడ అంతా ఇంతా కాదు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కక్ష పూరితంగా చంద్రబాబును జైలు కు పంపించిన జగన్ సర్కార్.. జైల్లో ఆయనకు కనీస వసతులు కూడా కల్పించడం లేదని టీడీపీ శ్రేణులు మండి మడుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి జైల్లో ఎలాంటి వీఐపీ వసతులు లేకుండా చూస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. .
చంద్రబాబుకు ప్రాణహాని ఉందని జైల్లో ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నారా లోకేష్ తాజాగా వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాలో కలకలం రేపుతున్నాయి. అయితే సానుభూతి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, చంద్రబాబు ప్రాణాలకు ముప్పు చేయాల్సిన అవసరత తమకు లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక స్కిల్ స్కామ్ పై ఒకవైపు రచ్చ కొనసాగుతుండగానే మరోవైపు ఫైబర్ స్కామ్ తెరపైకి వచ్చింది. ఈ స్కామ్ లో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ పాత్ర కూడా ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఏపీ సిఐడి కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తోంది. ఫైబర్ స్కామ్ లో నారా లోకేష్, వేమూరి వరప్రసాద్ ల పేర్లను ప్రధానంగా ప్రస్తావిస్తోంది. దీంతో అరెస్ట్ భయంతో నారా లోకేష్ డిల్లీ వెళ్లరాని వైసీపీ నేతలు చెబుతున్నారు. అవినీతికి పాల్పడిన వారు తప్పించుకోలేరని, త్వరలో లోకేష్ కూడా అరెస్ట్ కావడం ఖాయమని చెబుతోంది వైసీపీ వర్గం. దీంతో టీడీపీలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టంగా మారింది. ఒకవేళ లోకేష్ కూడా అరెస్ట్ అయితే ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నా మాట. మరి ఏం జరుగుతుదో చూడాలి.
Also Read:Anasuya:ఇంపాక్ట్ ఫుల్‌గా ‘పెదకాపు1’