స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు 14 రోజలు రిమాండ్ విధించగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక కోర్టు ఆదేశాల మేరకు స్నేహ బ్లాక్‌లో ప్రత్యేక గదిని సిద్ధం చేయగా ఖైదీ నెంబర్ 7691ని కేటాయించారు. చంద్రబాబుకు ఇంటి భోజనంతోపాటు మందులు ఇవ్వడానికి కోర్టు అనుమతించింది.
ఇక బాబు బెయిల్ కోసం టీడీపీ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేసింది. బాబు రిమాండ్‌కు నిరసిస్తూ టీడీపీ బంద్‌కు పిలుపునివ్వగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని తెలిపారు.
ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబును ప్రవేశపెట్టిన సీఐడీ 28 పేజీల రిమాండ్ రిపోర్టును సమర్పించింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
Also Read:చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్