కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబేః త‌ల‌సాని

173
Talasani

కులాల మ‌ధ్య చిచ్చు వ్య‌క్తి ముమ్మాటికి చంద్ర‌బాబే అన్నారు ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత మీడియాతో మాట్లాడారు త‌ల‌సాని. ఇటీవల ఏపీకి వెళ్లిన తలసాని.. దుర్గ గుడి వద్ద రాజకీయాలు చేశారని చంద్రబాబు అన్నారు. ఈసంద‌ర్భంగా చంద్ర‌బాబుపై తీవ్ర స్ధాయిలో మండిప‌డ్డారు త‌ల‌సాని. మాల,మాదిగలకు, బీసీలకు, కాపులకు గొడవ పెట్టింది చంద్రబాబే అని చెప్పారు.

చంద్ర‌బాబు మాదిరి ఎక్క‌డ బడితే అక్క‌డ రాజ‌కీయాలు మాట్లాడే అవ‌స‌రం త‌న‌కు లేద‌ని ఎపీ లో త‌న‌కు బంధువులు ఉన్నార‌న్నారు. హరికృష్ణ చనిపోతే అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడిన నీచమైన సంస్కృతి చంద్రబాబుదన్నారు. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా టీడీపీ వ్య‌తిరేకంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.

దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో.. ఫెడరల్ ఫ్రంట్ వేదికగా వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులను, నాయకులను కలుస్తున్నారు. సీఎం కేసీఆర్ మిగ‌తా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను క‌లిస్తే చంద్ర‌బాబుకు గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయ‌న్నారు. ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు కూడా చంద్ర‌బాబును సాగ‌నంపాల‌ని చూస్తున్నార‌ని చెప్పారు. ఏపీలో కూడా త‌మ‌ను అభిమానించే వారు ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు.