టీఆర్ఎస్ లోకి ఒంటేరు ప్ర‌తాప్ రెడ్డి..

160
Onteru Kcr

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. ఇటివ‌లే జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాల‌యిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్ప‌నున్నారు. కాంగ్రేస్ నేత ఒంటేరు ప్ర‌తాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేర‌నున్నారు. ఇటివ‌లే జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌జ్వేల్ నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి సీఎం కేసీఆర్ చేతిలో ఓట‌మిపాల‌య్యారు.

onteru Prathap Reddy In to Trs

రేపు సాయంత్రం సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో గులాబీ కండువా క‌ప్పుకోనున్న‌ట్లు స‌మాచారం. రేపు సాయంత్రం నిర్వ‌హించే ఓ కార్య‌క్ర‌మంలో ఒంటేరుకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి కేసీఆర్ ఆహ్వానించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వ‌రుస‌గా రెండు సార్లు సీఎం కేసీఆర్ పై పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు ఒంటేరు ప్ర‌తాప్ రెడ్డి. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోగా, 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు.