Champions Trophy: సెమీఫైనల్లో న్యూజిలాండ్

6
- Advertisement -

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే గ్రూప్ ఏ నుండి భారత్ సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది న్యూజిలాండ్. న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర (112 పరుగులు) అద్భుత శతకంతో రాణించి సాధించి, జట్టును సెమీఫైనల్‌కు చేర్చాడు. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్, భారత్ మార్చి 2న దుబాయిలో గ్రూప్ A టాప్ స్థానం కోసం తలపడనున్నాయి.

మైఖేల్ బ్రేస్‌వెల్ (4/36) అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను 236/9 స్కోర్‌కే పరిమితం చేశాడు. పాకిస్తాన్ భారీ అంచనాలతో ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టి నిరాశ పర్చింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై టోర్నమెంట్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది.

ఇక గ్రూప్ Bలో ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా మధ్య కీలక పోరు జరగనుండగా గెలిచిన జట్టు సెమీస్‌లో అడుగుపెట్టనుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రికార్డ్ ఛేజింగ్ విజయంతో ఆస్ర్టేలియా అందరినీ ఆశ్చర్యపరిచింది. జోష్ ఇంగ్లిస్, మాథ్యూ షార్ట్, మార్నస్ లాబుషేన్, అలెక్స్ కేరీ, గ్లెన్ మాక్స్‌వెల్ అద్భుత బ్యాటింగ్‌తో మెరిశారు. అయితే పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్‌వుడ్ గాయాల కారణంగా లేకపోవడం ఆస్ర్టేలియాకు పెద్ద ఎదురుదెబ్బ.

ఇప్పటివరకు అంచనాలకు తగ్గట్టుగా ప్రదర్శన ఇవ్వని దక్షిణాఫ్రికా, టైటిల్ కోసం గట్టి పోటీ ఇవ్వాలని చూస్తుంది. మరోవైపు, ఐసీసీ ఈవెంట్లలో తన ఛాంపియన్ షిప్ ప్రదర్శనను కొనసాగించేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉంది.

Also Read:కార్యకర్తలే పార్టీకి ఆయువుపట్టు !

- Advertisement -