ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది ఆఫ్ఘానిస్తాన్. 327 పరుగుల లక్ష్య ఛేదనలో 317 పరుగులకు ఆలౌట్ అయింది ఇంగ్లండ్. దీంతో రెండు మ్యాచ్‌ల ఓటమితో సెమీస్ రేసు నుండి తప్పుకుంది ఇంగ్లండ్.
జో రూట్(120) సెంచరీతో రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ ఎవరూ సహకారం అందించలేదు. దీంతో 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది ఇంగ్లండ్. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా (5/58) వికెట్లు తీయగా జద్రాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
అంతకుముందు నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గానిస్థాన్ 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (177) అద్భుతంగా ఆడి భారీ సెంచరీ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా (3 పాయింట్లు), దక్షిణాఫ్రికా (3 పాయింట్లు), అఫ్గానిస్థాన్ (2 పాయింట్లు) రేసులో ఉన్నాయి. రెండు మ్యాచ్‌లు ఆడిన ఆసీస్, దక్షిణాఫ్రికా ఒక్కో విజయం సాధించాయి.
Also Read:రేవంత్‌కు మతిభ్రమించింది: సతీష్ రెడ్డి

