స‌కినాల‌తో కేటీఆర్ పేరు

106
ktr

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌ధ్యంలో దేశ వ్యాప్తంగా ఈనెల 14 వ‌ర‌కు లాక్ డౌన్ విధించారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు త‌ప్ప మిగ‌తా వారంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని సూచించారు. దీంతో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది ఇళ్ల‌కే ప‌రిమిత‌మై టీవీలు చూస్తూ కూర్చుంటుండగా మ‌రికొంత మంది స్మార్ట్ ఫోన్ల‌లో బిజీ అయిపోయారు.

లాక్ డౌన్ సంద‌ర్భంగా టైం పాస్ కాక‌పోవ‌డంతో నిఖిల్ అనే యువ‌కుడు మంత్రి కేటీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నాడు. స‌కినాల పిండితో మంత్రి కేటీఆర్ పేరును రాశాడు. ఈ ఫోటోను ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేసి మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశాడు నిఖిల్. క్వారంటైన్‌ సమయంలో టైం పాస్‌ కోసం మా ఇంట్లో సకినాలు చేసుకున్నామని నిఖిల్‌ కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ..థాంక్స్‌ నిఖిల్‌..చాలా బాగుంది అని రిప్లై ఇచ్చారు. ఈఫోటో ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.