నాగ చైతన్య – సమంత త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. చైతూ కోసం ఏం చేయడానికైనా సిద్దమే అంటున్న సామ్ పెళ్లికి ముందే చైకి సంబంధించిన అలవాట్లను తన అలవాట్లుగా మార్చుకుంటుందట. తన డైలీ షెడ్యూల్లో చైకి ప్రాధాన్యత ఉండేలా మంచి భార్య అనిపించుకునేందుకు తహతహ లాడుతుందట. ఇక చైతూ కూడా నేనేం తక్కువనా అన్నట్లు సమంతకు ఇష్టమైన వంటకాలను నేర్చుకుని వండిపెట్టేందుకు సిద్దమయ్యాడట.ఇందుకోసం స్పెషలిస్టు చిట్కాలు కూడా తీసుకుంటున్నాడట.
ఇక నాగ చైతన్య సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండకపోయినప్పటికీ సమంత మాత్రం తనకు సంబంధించిన పలు విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె నాగచైతన్య వంట చేస్తోన్న ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసి, తనని చైతూ ఎంతబాగా చూసుకుంటున్నాడో చెప్పింది.
ఆ ఫొటోలో చైతూ గ్యాస్ స్టౌవ్ దగ్గర నిల్చుని బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాడు. చైతూ తన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసిన తర్వాతే బయటకు వెళ్తాడని సమంత చెప్పింది. ఈ ప్రపంచానికి తానే మహారాణి అనుకునేలా చేసిన దేవుడికి మోకాళ్లపై కూర్చుని అభివాదం చేస్తున్నానని సమంత పేర్కొంది. సమంత చేసిన ఈ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఎంతైన సమంత అదృష్టవంతురాలే కదా.