సమంత పై స్పందించు చైతు

67
- Advertisement -

అక్కినేని హీరో నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. కస్టడీ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆయన పలు విషయాలు పంచుకున్నారు. ‘మేము అభిమానులకు మంచి సక్సెస్ ఇవ్వాలని అనుకుంటాం. వారి అభిమానం, ప్రేమను తిరిగి ఇచ్చేది ఒక మంచి సినిమానే. ఇటీవల మా కుటుంబం నుంచి కొన్ని చిత్రాలకు సరైన రిజల్ట్ రాలేదు. యాక్టర్స్ కెరీర్‌లో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ సహజం.’ అని చైతూ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఏజెంట్ సినిమా పై, ప్రస్తుతం అఖిల్ అక్కినేని పరిస్థితి పై చైతు పై విధంగా స్పందించాడు.

అయితే, నాగ చైతన్య కామెంట్స్ పై సమంత ఫ్యాన్స్ మరోలా స్పందిస్తున్నారు. సమంత తాజాగా పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రిటీ జాబితాలో మొదటిస్థానం దక్కించుకుంది. గతంలో తొమ్మిదో స్థానంలో ఉన్న సమంత ఈ సారి మొదటి స్థానాన్ని సంపాదించుకోవడం విశేషం. ఇదే లిస్ట్‌లో పూజా హెగ్డే 17వ స్థానంలో ఉంది. ఆర్మాక్స్‌ లిస్టులో సమంత వరుసగా ఏడు సార్లు టాప్‌లో ఉంది. మొత్తానికి సమంతకు ఫస్ట్ ర్యాంక్ దక్కింది. సమంత సినీ కెరీర్ లో నిజంగా ఇది చెప్పుకోతగ్గ అంశమే.

Also Read: ఎన్టీఆర్ సినిమా పై షాకింగ్ కామెంట్స్

అందుకే, సమంతకు మిగిలిన సినీ ప్రముఖులు, అభిమానులు నుంచి కూడా అభినందనలు అందుతున్నాయి. కానీ, నాగచైతన్య మాత్రం సమంత ఘనత పై, ఆమెకు వచ్చిన ఫస్ట్ ర్యాంక్ పై కనీసం స్పందించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో సమంత పై స్పందించు చైతు అంటూ సామ్ ఫ్యాన్స్ మెసేజ్ లు చేస్తున్నారు. మొత్తమ్మీద అందాల ముద్దుగుమ్మ సమంత మాత్రం హిట్స్ & ప్లాప్స్ కు సంబంధం లేకుండా కెరీర్ లో దుసుకుపోతోంది.

Also Read: మల్లేశం దర్శకుడి మరో ఎమోషనల్ జర్నీ.. “8AM METRO”

- Advertisement -