చావు కబురు చల్లగా..అప్‌డేట్స్..!

87
lavanya tripathi

RX 100 సినిమాతో యూత్‌లో తనకంటూ తెచ్చుకున్న హీరో కార్తికేయ. అయితే ఆర్‌ ఎక్స్‌ 100 తర్వాత కార్తికేయ చేసిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో వెరైటీ టైటిల్‌, కొత్త గెటప్‌లో తెరముందుకు రాబోతున్నాడు.

అల్లు అరవింద్ సమర్ఫణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో కౌశిక్ దర్శకత్వంలో చావు కబురు చల్లగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయినా చిత్ర దర్శకుడు కౌశిక్ మాత్రం ఈ సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాడట. ఆన్ లైన్లో హీరో హీరోయిన్లకు స్క్రిప్టు చదివి వినిపిస్తూ, కొన్ని సీన్లు ముందుగానే ప్రాక్టీస్ చేయిస్తున్నాడట.

ఈ సినిమాలో ‘బస్తీ బాలరాజు’ పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. ఈ సినిమాకి జాక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.