పుష్ప మూవీలో యాంకర్ సుమ…పుకార్లే!

128
anchor suma

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియన్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బన్నీకి ఇది 20వ సినిమా.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ యాంకర్ సుమ కీలకరోల్ పోషిస్తుందని వార్తలు వెలువడగా వాటిని కొట్టిపారేసింది చిత్రయూనిట్.

సుమ ఈ చిత్రంలో నటిస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఈ రూమర్లను ఎవరు పుట్టించారో తెలియడం లేదని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.