కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఆరు నెలల పాటు కేంద్రం మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం ఆరు నెలల పాటు మారటోరియం సమయంలో విధించిన వడ్డీని వదులుకునేందుకు సిద్దమని తెలిపింది.
ఎంఎస్ఎంఈలు, గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలపై, వినియోగదారు వస్తువుల ఈఎంఐలపై వడ్డీలను మినహాయించనున్నట్లు తెలిపింది. అయితే అన్ని రకాల రుణాలకు వడ్డీని చెల్లించాలంటే రూ.6 లక్షల కోట్లు భారం పడుతుందని, అందుకే రూ.2 కోట్లు ఆ లోపుగల రుణాలకే వడ్డీ చెల్లించాలని నిర్ణయించామని కేంద్రం తెలిపింది.
కాగా, మారటోరియం పీరియడ్ రుణాలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు సమర్పించిన అఫిడవిట్ రుణగ్రహీతలకు ఊరటనిచ్చేలా ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలలపాటు కేంద్రం మారటోరియం విధించింది.