ఐపీఎల్ 13…నేడు రెండు మ్యాచ్‌లు

97
ipl 2020

ఐపీఎల్ సీజన్ 13 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు జరుగగా ముంబై,ఢిల్లీ,కోల్ కతా,హైదరాబాద్,రాజస్ధాన్,బెంగళూరు 2 మ్యాచ్‌ల్లో గెలుపొందగా పంజాబ్,చెన్నై ఒక మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.

ఇప్పటివరకు రోజుకు ఒక మ్యాచ్ మాత్రమే జరుగగా నేడు రెండు మ్యాచ్‌లు (డబుల్‌ హెడర్‌) జరుగనున్నాయి. ఈ సీజన్‌లో ఒకే రోజు రెండు మ్యాచ్‌లు జరుగడం ఇదే తొలిసారి. మధ్యాహ్నం అబుదాబి వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. రాత్రి షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడనున్నాయి.

తొలి రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేసి అదరగొట్టిన రాజస్థాన్‌ మూడో మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓటమి పాలై డీలా పడగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సూపర్‌ ఓవర్‌లో నెగ్గిన బెంగళూరు ఫుల్‌ జోష్‌లో ఉంది. ఢిల్లీ, కోల్‌కతా మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.