కేంద్రం నుంచి కొనసాగుతున్న వ్యాక్సిన్ల పంపిణీ..

65
corona vaccine

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్ల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 20 కోట్లకు పైగా వ్యాక్సిన్లను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 1.84 కోట్లకు పైగా వ్యాక్సిన్లు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. కాగా, రాబోయే మూడురోజుల్లో 51 లక్షల వ్యాక్సిన్లు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 61,41,040 డోసుల పంపిణీ చేసింది. అందులో ఇప్పటివరకు 54,47,541 డోసుల వ్యాక్సిన్ల ఉపయోగం జరిగింది. ఇంకా తెలంగాణ రాష్ట్రం వద్ద అందుబాటులో 6,93,499 వ్యాక్సిన్లు ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.