- Advertisement -
మూలధన వ్యయానికి తెలంగాణకు అదనంగా రూ .179 కోట్ల నిధులు మంజూరు చేసింది కేంద్రం. పౌర-కేంద్రీకృత ప్రాంతాలలో సంస్కరణలను పూర్తి చేయడానికి ప్రోత్సాహకంగా అదనపు నిధులు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన 4 సంస్కరణల్లో మూడింటిని పూర్తి చేసింది తెలంగాణ రాష్ట్రం.
ఇలా మూడు సంస్కరణలను పూర్తి చేసిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలవగా మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పట్టణాభివృద్ధిలో సంస్కరణలు పూర్తి చేసింది తెలంగాణ రాష్ట్రం.రూ. 179 కోట్ల ప్రోత్సాహక అదనపు నిధులలో మొదటి వాయిదా కింద రూ.89.50 కోట్లు విడుదల చేసింది కేంద్రం.
- Advertisement -