పండుగల వేళ కోవిడ్ నియమావళి…

37
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించింది. ముఖ్యంగా జనవాసాలు ఉన్న చోట తప్పనిసరిగా మాస్క్‌ పెట్టుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రం పలు సూచనలు చేసింది.

దేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ల వ్యాప్తి, దీని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, నూతన సంవత్సర వేడుకలు, పండుగల సందర్భంగా ప్రజలు కోవిడ్ నియమావళి పాటించేలా చూడటం, మూడో డోసు/బూస్టర్ డోసు తీసుకునేలా చేయడం వంటివి చేయాలని రాష్ట్రాలకు సూచించింది. కరోనా పాజిటివ్ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపడంతోపాటు, ఆస్పత్రుల్లో తగిన సన్నద్ధత కలిగి ఉండాలని కూడా కేంద్రం ఆదేశించింది.

అత్యవసర పరిస్థితిలో చికిత్సకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రులు, అధికారులకు కేంద్రం సూచించింది. వివిధ దేశాల్లో విస్తరిస్తున్న బిఎఫ్ 7 వేరియంట్ ప్రభావం, ఇతర దేశాల్లో పరిస్థితులు, కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రం, రాష్ట్రాలకు వివరించింది. ఈ అంశంపై కేంద్రం రాష్ట్రాలకు మరో లేఖ కూడా రాసింది.

కోవిడ్-19 విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ నియమావళి పాటించడంపై దృష్టి పెట్టాలని సూచించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.

ఇవి కూడా చదవండి…

నేటినుంచి నాజల్‌స్ప్రే వినియోగం

భారత్ కరోనా అప్‌డేట్..

ప్రపంచదేశాలపై BF7 పంజా..

- Advertisement -