- Advertisement -
విదేశీ ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది.విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఐసోలేషన్ నిబంధనలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.విదేశీ ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 22న అమలులోకి వస్తాయని పేర్కొంది.
ఎయిర్పోర్ట్లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్ కేంద్రంలో ఉండటం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కరోనా రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సాధారణ కొవిడ్ ప్రోటోకాల్ అనుసరిస్తే సరిపోతుందని వెల్లడించింది.
విదేశీ ప్రయాణికుల కోసం సవరించిన మార్గదర్శకాలు మినహా మిగతా నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్రం స్పష్టం చేసింది.
- Advertisement -