కేంద్రం కీలక నిర్ణయం….

250
- Advertisement -

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా బలవంతపు మత మార్పిళ్లకు సంబంధించి త్వరలో ఒక కొత్త చట్టం తీసుకువస్తామని పేర్కొన్నారు. మత మార్పిడికి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే చట్టాలు అమలులో ఉన్నాయని తెలిపింది. 9రాష్ట్ర ప్రభుత్వాలు బలవంతపు మతమార్పిళ్లకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్రం తరపున కూడా అతి త్వరలో చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

ఇలాంటి చట్టం కేంద్రంలో కూడా తీసుకువస్తామని తెలిపింది. గత కొన్నేళ్లుగా లవ్‌జిహాద్‌ అనే కొత్త కోణం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని తెలిపిన కేంద్రం…ముఖ్యంగా హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిల మధ్య వివాహాల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో జరిగిన అప్తాభ్‌ శ్రద్దా వాకర్‌ కేసుపై కూడా చర్చ జరుగుతున్నందువల్ల దీనిపై సమగ్రమైన చట్టం తీసుకువస్తామని తెలిపింది.

బలవంతపు మతమార్పిళ్లకు వ్యతిరేకంగా ఇప్పటికే చట్టాలు తెచ్చిన రాష్ట్రాలు ఇవే

ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, హర్యానా.

ఇవి కూడా చదవండి….

దామరచర్లకు సీఎం కేసీఆర్..

కొత్త సచివాలయం..ముహూర్తం ఖరారు

సూపర్‌స్టార్‌కు మంత్రి తలసాని నివాళి

- Advertisement -