తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ మేరకు పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌కు అధికారికంగా లేఖను అందించారు. ఈసందర్భంగా డిసెంబర్ 9న అనగా రేపు శుక్రవారం మధ్యాహ్నం 1.20నిమిషాలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
రేపు మధ్యహ్నం తెలంగాణ భవన్‌లో అధికారిక లేఖకు రిప్లైగా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించనున్నారు. అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. పతావిష్కరణ కార్యక్రమంను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని సీఎం కోరారు. వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తెలిపారు.
ECI accepts the change in the name of 'Telangana Rashtra Samithi' (TRS) to 'Bharat Rashtra Samithi'. pic.twitter.com/VZgDptxVvZ
— ANI (@ANI) December 8, 2022
ఇవి కూడా చదవండి…