- Advertisement -
రేపు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించేందుకు దేశవ్యాప్తంగా 1,600మందిని పరిశీలకులను నియమించారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. వీరంతా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
ఈసారి జరగిన సార్వత్రిక ఎన్నికల్లో 22.3లక్షల బ్యాలెట్ యూనిట్లు, 16.3లక్షల కంట్రోల్ యూనిట్లు, 17.3 లక్షల వీవీప్యాట్ లను వినిగించింది కేంద్ర ఎన్నికల సంఘం. 542లోక్ సభ స్ధానాలకు గాను మొత్తం 8వేల మంది అభ్యర్దులు బరిలో ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్ నుంచి 186మంది అభ్యర్దులు బరిలో నిలిచారు. దేశ చరిత్రలో సాధారణ ఎన్నికల్లో అత్యధికమైన పోలింగ్ ( 67.11) నమోదైంది.
- Advertisement -