రేపటి నుంచి చంద్రబాబు రాజకీయ నిరుద్యోగిః విజయసాయి రెడ్డి

217
Chandrababu

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి. రేపు ఫలితాలు వెల్లువడనున్న నేపథ్యంలో చంద్రబాబు చేస్తున్న హాడావుడిపై ఆయన ట్వీట్టర్ లో కామెంట్స్ చేశారు. ఏపీలో ఎన్నికల కౌంటింగును నిలిపి వేయించడానికి చంద్రబాబు చేయని కుతంత్రం లేదు. వీవీప్యాట్ల లెక్కింపు పేరుతో రెండు సార్లు సుప్రీంలో పిటిషన్ వేసి ఓడిపోయాడు. తన అనుకూల వ్యక్తులతో ఏపీ హైకోర్టులో, సుప్రీంలో మరోసారి అత్యవసర పిటిషన్లు దాఖలు చేయించినా తిరస్కరణకు గురయ్యాయని చెప్పారు.

23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త వర్క్ కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడు. ఈయనకు ఉపాధి కల్పించే స్థితిలో వారెవరూ లేరు. వాళ్లే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారు. ఒక ప్రయోజనకర కార్యక్రమం కోసం ప్రయాణాలు చేస్తే అందరూ ప్రశంసిస్తారు. చంద్రబాబు తిరుగుళ్లు మాత్రం ఊసుపోక చేస్తున్న దేశదిమ్మరి యాత్రల్లా ఉన్నాయి. ఓటమి తప్పదని తెలిసి తనను తాను ఊరడించుకునేందుకు ప్రాంతీయ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు అని విమ‌ర్శించారు.