- Advertisement -
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రధానమంత్రి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కేంద్ర కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో సమావేశం సాగనుంది. సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో వైరస్ పరిస్థితులపై ప్రధాని సమీక్ష నిర్వహించనున్నారు.
కేంద్రమంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సమావేశంలో ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, టీకాలు, అవసరమైన ఔషధాలపై లభ్యత తదితర ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు, తీసుకోవాల్సిన చర్యలపై గత వారం రోజులుగా ప్రధాని దాదాపు ప్రతి రోజూ ఉన్నత స్థాయి అధికారులు, వైద్యులు, శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. నేడు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
- Advertisement -