‘సి-సెక్షన్’ మరణాలపై WHO

1
- Advertisement -

రాజస్థాన్‌లో సిజేరియన్ (సి-సెక్షన్) ఆపరేషన్ల అనంతరం ప్రసవించిన తల్లులు మరణించినట్లు వచ్చిన నివేదికలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సమాచారాన్ని కోరింది. ఈ పరిణామం తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెంటనే రంగంలోకి దిగి ఈ మరణాలకు గల కారణాలపై సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రాష్ట్రంలోని ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో సి-సెక్షన్ శస్త్రచికిత్సల తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే పలువురు బాలింతలు మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. శస్త్రచికిత్సల సమయంలో ఉపయోగించిన మందులు, సెలైన్ ఐవి (IV) ఫ్లూయిడ్స్ నాణ్యత లోపించడం లేదా ఇన్ఫెక్షన్ల వల్ల ఈ మరణాలు సంభవించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ తీవ్రమైన అంశంపై అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తూ వివరాలను సేకరించడంతో…కేంద్ర ప్రభుత్వం దీనిని అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయంగా పరిగణించింది. తక్షణమే దర్యాప్తు చేపట్టి అసలు ఏం జరిగిందనే దానిపై పూర్తి నివేదికను పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు రాజస్థాన్ వైద్య ఆరోగ్య రంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం రాజస్థాన్ ప్రభుత్వం ఈ ఘటనలపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరుపుతోంది. నిందితులైన ఆసుపత్రి సిబ్బందిపై, అలాగే అక్కడ సరఫరా అయిన ఔషధాల నాణ్యతపై తనిఖీలు ముమ్మరం చేసినట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. కేంద్రానికి త్వరలోనే పూర్తి నివేదికను అందజేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

Also Read:ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’

- Advertisement -