తెలుగువాళ్ళంటే కేంద్రానికి ఇంత చిన్నచూపా ?

1109
- Advertisement -

అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ సౌత్ రాష్ట్రాలను ఒకరీతిగా నార్త్ రాష్ట్రాలను మరో రీతిగా ట్రీట్ చేస్తుందనే వాదన మొదటి నుంచి కూడా వినిపిస్తూనే ఉంది. కేంద్రానికి నార్త్ రాష్ట్రాలపై ఉన్న ప్రేమ సౌత్ రాష్ట్రాలపై ఉండదని కమలనాథుల వైఖరి చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఎందుకంటే సౌత్ లో భాష ప్రతిపాధిక పార్టీలనే ఇక్కడి ప్రజలు ఎక్కువగా ఆదరిస్తారు. అందుకే ఇక్కడ జాతీయ పార్టీలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీలే బలంగా కనిపిస్తాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీని ఆదరించే పరిస్థితి లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలపై చులకన భావంతోనే ఉందనేది పోలిటికల్ సర్కిల్స్ లో మొదటి నుంచి వినిపిస్తున్న మాట. .

ఇక తాజాగా తెలుగు రాష్ట్రాలపై.. తెలుగు భాషపై కేంద్రానికి ఎంత చిన్న చూపు ఉందో మరోసారి రుజువైంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మద్య పార్లమెంట్ లో చోటు చేసుకున్నా వాదోపవాదాలు చూస్తే కేంద్రానికి తెలుగు వాళ్ళంటే ఎంత చిన్నచూపో ఇట్టే అర్థమౌతుంది. ఇక వివరాల్లోకి వెళితే డాలర్ తో పోలిస్తే రూపాయి దారుణంగా పతనం అయిందని మోడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ డాలర్ రూపాయి మారకం విలువ 66 గా ఉండగా ఇప్పుడు 80 రూపాయలకు చేరిందని, రూపాయి పతనం అవ్వడానికి కారణాలు ఏంటో చెప్పాలని రేవంత్ రెడ్డి హిందీలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అయితే రేవంత్ రెడ్డి హిందీ అనర్గళంగా లేకపోవడంతో.. దాన్ని పాయింట్ అవుట్ చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలసీతారామన్ మాట్లాడారు. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు బలహీనమైన హిందీతో ప్రశ్నలు సంధించారు.. వారికి నేను కూడా బలహీనమైన హిందీ తోనే సమాధానం చెబుతానని నిర్మలసీతారామన్ అన్నారు. దీంతో వివాదం రాజుకుంది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా హిందీ బలహీనంగా ఉందని కించపరచడం ఎందుకంటూ సోషల్ మీడియాలో నిర్మలసీతా రామన్ పై మండి పడుతున్నారు నెటిజన్స్. ఇక నిర్మలసీతారామన్ వ్యావహార శైలిపై బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితా కూడా స్పందించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వీక్ హిందీ గురించి కాకుండా వీక్ రూపాయి గురించి స్పందిస్తే బాగుండేదంటూ వ్యాఖ్యానించింది. ఇలా చాలా మంది నేతలు నిర్మలా సీతారామన్ వ్యాఖ్యాలను తీవ్రంగానే ఖండిస్తున్నారు. దీన్ని బట్టి సౌత్ నేతలపై బీజేపీ కి ఎంత చిన్న చూపు ఉందో మరోసారి అర్థమౌతుందని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు..

ఇవి కూడా చదవండి…

బీజేపీ అక్రమ పరిపాలనకు ఇదే నిదర్శనం!

బీజేపీకి బీఆర్ఎస్ ఫీవర్ :కవిత

చైనా ఉచ్చులో.. 82దేశాలు విలవిల

- Advertisement -