శ్రీదేవి మృతి పట్ల ప్రముఖుల నివాళి…

174
Celebs Remembers Veteran Actor Sridevi
- Advertisement -

అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో భారతదే సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ,సీఎం కేసీఆర్ శ్రీదేవి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణం భారతీయ సినీ పరిశ్రమకు, తెలుగు సినిమా అభిమానులకు తీరని లోటును మిగులుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నో సినిమాలలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన శ్రీదేవి… అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. తన అందం, అభినయం, నాట్యాలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారని చెప్పారు. ఎన్నో భాషలలో నటించి, మెప్పించిన ఘనత ఆమె సొంతమని అన్నారు. శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

()ఇంతలా దేవుడ్ని ఎప్పుడూ ద్వేషించలేదంటూ ట్వీట్ చేశారు. ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు… శ్రీదేవి ప్రేమించే అందరికి నా సంతాపమన్నారు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.

()దేవి మరణించారన్న విషయం తెలియగానే చాలా భాధ వేసిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమెది పెద్ద వయసు కూడా కాదని.. ఉదయం దైవదర్శనానికి వెళుతుండగా ఈ విషయం చెప్పారని… చాలా బాధ పడ్డానని అన్నారు. హీరోయిన్లందరికీ శ్రీదేవి ఒక డ్రీమ్ గర్ల్, ఒక ఇన్స్పిరేషన్ అని అన్నారు. ఆమెలా అత్యున్నత స్థాయికి ఎదగాలని మేమంతా ఆశపడినవారమేనని చెప్పారు.

Celebs Remembers Veteran Actor Sridevi

() శ్రీదేవి హఠాన్మరణంపై ప్రముఖ హీరో జూనియర్ ఎన్‌టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీదేవి లేని లోటు పూడ్చలేనిదని, ఆమె స్థానాన్ని ఇంకెవ్వరూ భర్తీ చేయలేరని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలిపారు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఉన్నత శిఖరాలను ఆమె అధిరోహించారని ఆయన అన్నారు.

()శ్రీదేవి మరణం తప్పకుండా చిత్ర పరిశ్రమకు భారీ లోటని మాస్ మహారాజ్ రవితేజ అన్నారు. ఆమె మరణించిందన్న వార్తను తానిప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆయన అన్నారు. ఆమె లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని ఆయన చెప్పారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

()యువ హీరోలు సుధీర్ బాబు, నాగశౌర్య, కమెడియన్ వెన్నెల కిశోర్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తదితరులు కూడా శ్రీదేవి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

sri devi

()ఓ లెజెండ్‌ ఇక లేరు… భారతీయ సినీ చరిత్రలో ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు. సినీ ప్రముఖులు అమితాబ్, ఏఆర్ రెహమాన్, సుస్మితాసేన్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, అనుష్క శర్మ, అను ఇమ్మాన్యూల్‌, ప్రీతీ జింతా, సిద్ధార్థ్‌ మల్హోత్రా, జానీ లివర్‌, జరీన్‌ ఖాన్‌, మధుర్‌ బండార్కర్‌, అద్నాన్‌ సమీ, గౌతమి, టాలీవుడ్ ప్రముఖులతో పాటు తదితరులు సోషల్ మీడియాలో స్పందించారు.

- Advertisement -