శ్రీదేవి చివరి క్షణాలు..వీడియో

253
Sridevi last video before her death
- Advertisement -

ప్రముఖ సినీనటి శ్రీదేవి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ నటుడు మొహిత్ మార్వా వివాహం కోసం యూఏఈలోని రస్ అల్ ఖైమాకు వెళ్లిన ఆమె… అందరినీ విడిచి నింగికెగిశారు. నిన్న రాత్రి 11 నుంచి 11.30 గంటల మధ్య ఆమె తుదిశ్వాస విడిచినట్టు ఆమె మరిది సంజయ్ కపూర్ తెలిపారు. శ్రీదేవి మరణవార్త వినగానే ముంబై నుంచి హుటాహుటిన ఆయన దుబాయ్ బయల్దేరారు. మరోవైపు, శ్రీదేవి మరణవార్తతో ఆమె అభిమానులంతా తీవ్ర విషాదానికి లోనయ్యారు.

54 ఏళ్ల వయసులోనే ఆమె మరణించడాన్ని సిని ప్రపంచం జీర్ణించుకోలేకపోతున్నారు. దుబాయ్‌లో బంధువు మోహిత్ పెళ్లికి వెళ్లిన ఆమె.. అక్క‌డే గుండెపోటుతో క‌న్నుమూశారు. ఈ వేడుక‌లో శ్రీదేవి పాల్గొన్న వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. మృతి చెంద‌డానికి కొన్ని గంట‌ల ముందు పెళ్లి వేడుక‌లో ఆమె పాల్గొన్న వీడియో అది.

- Advertisement -